EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ కూడగి గారి ఆధ్వర్యంలో జాతీయ పోషణ వారోత్సవం-2026

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 06:05 PM | TELANGANA, నల్గొండ
    కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ కూడగి గారి ఆధ్వర్యంలో జాతీయ పోషణ వారోత్సవం-2026

    కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి ప్రిన్సిపాల్ డా.బాబాసాహెబ్ లక్ష్మాన్సింగ్ కూడగి గారి ఆధ్వర్యంలో జాతీయ పోషణ వారోత్సవం-2026 లో భాగంగా పానగల్లులోని .అంగనవాడి స్కూల్ పోషణ వారోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మరియా విభాగాధిపతి Dr. మారుతి వర ప్రసాద్ శర్మ మరియు ప్రొఫెసర్ డా.బాలరాజు గార్లు మాట్లాడుతూ పోషకాహార విలువల గురించి మరియు ఇంట్లో వాడుకునే నిత్యవసరాలనుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు, కమ్యూనిటీ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డాక్టర్ నితిన్. గారు మాట్లాడుతూ పిల్లలకు, బాలికలకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కలిపించారు మరియు బాలింతలకు, గర్భిణులకు పోషన్ వారోత్సవం -2026 కారిక్రమం గురించి పోషన్అభ్యన్ సేవల వినియోగం గురించి అవగాహన ఇవ్వడం జరిగింది.
    కౌమారదశ బాలికల కోసం:
    1)ఐరన్ సమృద్ధిగా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు వినియోగం గురించి అవగాహన కలిగించారు
    2)ఐ.ఎఫ్.ఏ మాత్ర, నులి పురుగుల నివారణకి ఆరు నెలలకి ఒకసారి ఆల్బెండాజోల్ మాత్ర వినియోగించాలి అని సూచించారు
    3) ఎల్లపుడు మూత పెట్టిన పాత్రలలో భద్రంగా ఉంచిన నీల్లనే త్రాగాలి, వంట చేసే ముందు, తినే ముందు ప్రతి సారి తప్పనిసరిగా చేతులు కడుక్కోలవని సూచించారు.
    @గర్భిణి స్త్రీలకి:
    1) విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, బలోపేతం చేయబడిన పాలు, నూనె మరియు ఐయోడిన్ కలిగిన ఉప్పు వాడుకోవాలని చెప్పారు
    2)నాలుగో నెలలో మొదలుపెట్టి ఆరో నెల వచ్చేవరకు రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు
    3) ప్రసవానికి ముందు కనీసం నాలుగు సార్లు గర్భస్థ (ఎ. ఎన్.సి.) పరీక్షలు, దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో మాత్రమే ప్రసవం చేయించుకోవాలని చెప్పారు
    @పోషణ్ అభియాన్ - పాలిచ్చే తల్లుల కోసం:
    1)C విటమిన్లు మరియు ఐరన్ సమృద్ధి గా ఉన్న వివిధ రకాల పోషకాహారం, పాలు, నూనె, అయోడిన్ ఉన్న ఉప్పు, ప్రసవించిన తరువాత ప్రతి రోజూ ఒక ఎరుపు రంగు ఐ.ఎఫ్.ఏ మాత్ర, డాక్టర్ చెప్పినన్ని కాల్షియం మాత్రలు వాడాలని సూచించారు
    2) బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే ముర్రుపాలు, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు కేవలం తల్లి పాలు మాత్రమే, బిడ్డకు ఆరు నెలలు పూర్తి అయిన తరువాత అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు
    మరియు పిల్లలకి, బాలికలకి, బాలింతలకు గర్భిణులకు మరియు పేషెంట్ల కు పండ్లు, కూరగాయ మొక్కలు, రాగి జావా మరియు కూరగాయా విత్తనాలు పంచడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో డా. శంకర్ , డా.మౌనిక, డా నరేన్ దత్ , డా. నితిన్ , స్టాటిక్ స్టిక్స్ ఆఫీసర్. నాగేష్.హెల్త్ అసిస్టెంట్స్ బద్దం నగేష్, ఎం.ఎస్.డ స్వామి, పారామెడికల్ staff యాదగిరి రెడ్డి, లాబ్ టెక్నీషియన్ గోపాల్, , అలీ, ఏ ఎన్ఎం సిస్టర్స్ , విజయ. శారద అంగన్వాడీ టీచర్. అరుంధతి. హేమలత. మన రూప. రత్న.మరియు కామినేని మెడికల్ కాలేజీ హౌస్ సర్జన్స్ పాల్గొన్నారు.