EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డాక్టర్ కిఫాయత్ MD

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 07:36 PM | TELANGANA, వరంగల్
    హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డాక్టర్ కిఫాయత్ MD

    హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డాక్టర్ కిఫాయత్ MDని సన్మానించిన మండి బజార్ జెండా ప్రెసిడెంట్ ఎం.ఏ. తాహెర్హన్మకొండ: వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (USA గవర్నమెంట్ న్యూయార్క్ ఆమోదిత, UNO రిజిస్టర్డ్) జాతీయ అధ్యక్షులుగా (National President) నియమితులైన డాక్టర్ కిఫాయత్ MDని మండి బజార్ జెండా ప్రెసిడెంట్ ఎం.ఏ. తాహెర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిఫాయత్‌కు ఎం.ఏ. తాహెర్ ఘనంగా దైవ దర్శనం చేయించి, శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో ఎండి అస్లాం, టీడీపీ రాష్ట్ర నాయకులు శహాబాద్ మాణిక్యం, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లాపు మహేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జగన్, బీసీ సంఘం నాయకులు శివ, అనిల్, తిరుపతి రెడ్డి తదితర నాయకులు ఉన్నారు. వీరంతా డాక్టర్ కిఫాయత్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.