EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 08:11 PM | TELANGANA, వరంగల్
    ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

    రూ.6,05,000/- నగదు, పల్సర్ బైక్, గ్లౌజులు మరియు ఇనుప రాడ్ స్వాధీనం.

    హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ:30-08-2026 నాడు జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
    హనుమకొండ మచిలీబజార్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ నబీ @ ఆర్షద్ (31), ఎండి. సర్వర్ (40) మరియు 16 సంవత్సరాల బాలుడు కలిసి చోరీకి పథకం రచించి, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిది మచిలీబజార్‌కు చెందిన ఒక వ్యక్తి ఇంట్లో నగదు చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
    విచారణలో భాగంగా నిందితులు తెలిపిన వివరాల ప్రకారం, 30.08.2026 నాడు ముగ్గురూ కలిసి బాధితుడి ఇంటి పరిసరాలను ముందుగా పరిశీలించి, బాధితుడు ఇంటి నుండి బయటకు వెళ్లిన సమయాన్ని గమనించారు. అనంతరం ఇంటి వెనుక భాగం నుండి లోపలికి ప్రవేశించి, బీరువా తాళాన్ని ఇనుప రాడ్ మరియు రాయితో పగులగొట్టి అందులోని 7 లక్షల నగదును అపహరించారు. చోరీ చేసిన నగదును అనంతరం సుబేదారి–నక్కలగుట్టలోని ఒక హోటల్‌లో ముగ్గురూ కలిసి పంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు పోలీసులకు చిక్కకుండా ఇతర ప్రాంతాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో 03.09.2026 ఉదయం బాలాంజనేయ స్వామి టెంపుల్, న్యూ బస్టాండ్ రోడ్, హనుమకొండ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

    నిందితుడు A1 నబీ తన భార్య కి విడాకులు ఇచ్చి కొన్ని నెలల నుండి వేరుగా ఉంటున్నాడు, నిందితుడు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు దారుడిని తనకు అవసర నిమిత్తం 50 వేల రూపాయలు ఇవ్వమని అడగగా ఫిర్యాదుదారుడు అరేయ్ నువ్వు సరిగా పని చేయవు నీకు డబ్బులు ఇస్తే మళ్లీ తిరిగి ఎలా ఇస్తావు
    నా దగ్గర డబ్బులు లేవని చెప్పినాడు, దాంతో నిందితుడు ఫిర్యాదాడుపై కోపం పెట్టుకొని ఫిర్యాదు దారుడు చెప్పుల బిజినెస్ చెస్తాడు, ఎప్పటికీ డబ్బులు ఉంటాయి కావాలనే డబ్బులు ఇస్తాలేడు అని ఇతని ఇంట్లో ఎలాగైనా దొంగతనం చేయాలని పథకం పన్నాడు, ఇదే విషయం మిగతా ఇద్దరి నిందితులకు చెప్పగా వారు తనతో పాటు దొంగతనం చేయడానికి ఒప్పుకున్నారు అలా ముగ్గురు కలిసి పథకం ప్రకారం ఏడు లక్షల నగదు చోరీకి పాల్పడినారు

    ఇవి కూడా చదవండి

    స్వాధీనం చేసుకున్న సొత్తు:
    • నిందితుడుA1 మహమ్మద్ నబీ వద్ద నుండి రూ.3,12,000/- నగదు మరియు
    చోరీకి ఉపయోగించిన బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, Regd. No. TS-03-EG-7045

    • నిందితుడు A2 ఎండి. సర్వర్ వద్ద నుండి రూ.2,93,000/- నగదు
    • మొత్తం నగదు రూ.6,05,000/-
    బాలుడి వద్ద నుండి
    04 తెల్లని సర్జికల్ గ్లౌజులు
    • సుమారు 18 అంగుళాల పొడవైన ఇనుప రాడ్
    స్వాధీనం చేసుకున్న నగదు మరియు ఇతర వస్తువులను పంచుల సమక్షంలో సీజ్ చేసి, కేసు దర్యాప్తులో భాగంగా భద్రపరిచారు.
    ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతోంది.16 సంవత్సరాల బాలుడికి సంబంధించి జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయి.
    ఈ సందర్బంగా హన్మకొండ ఇన్స్పెక్టర్ శ్రీ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ, ఇళ్ల నుండి బయటకు వెళ్లే సమయంలో విలువైన నగదు, ఆభరణాలు మొదలైన వాటిని ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
    దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రావూఫ్, కానిస్టేబుల్లు విజయ్ కాంత్, వల్లాల అశోక్, బాలమహిపాల్, రమానాకర్, కిరణ్ కుమార్ ,తిరుపతి హోం గార్డ్స్ కుమారస్వామి , రవి , AAO ఎండి సల్మాన్ పాషా, SI కిశోర్ ల ను హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీ మచ్చ శివకుమార్ గారు అభినందించారు.
    హనుమకొండ పోలీస్ స్టేషన్
    వరంగల్ పోలీస్ కమిషనరేట్