EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 03 Sep 2026, 08:14 PM | TELANGANA, వరంగల్
    ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జనసేన పార్టీ మండల నాయకులు అర్షం ఆనంద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బర్ల శివ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జూపూడి వందిత్, మాడుగుల అఖిల్, పండు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా నిర్వహిస్తూ నినాదాలు చేశారు.