EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 05 Sep 2026, 02:37 PM | TELANGANA, తాజా వార్తలు, వరంగల్
    మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

    ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా!

    మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 6న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది.

    వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించకపోవడంపై కేసీఆర్‌ను ప్రశ్నించడం జరిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించడం జరిగింది.

    ఇవి కూడా చదవండి

    కాంగ్రెస్ ప్రజా పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి పథకాలతో ప్రజలకు అందుతున్న సంక్షేమ ఫలాలను వివరించడం జరిగింది.

    హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు భారీగా తరలివచ్చి మహా ధర్నాను విజయవంతం చేయాలని సూచించడం జరిగింది.

    మహా ధర్నా ఏర్పాట్లపై సహచర మంత్రి అజారుద్దీన్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.