EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తిప్పర్తి మండలం 26 గ్రామపంచాయతీలవద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా

    Author
    Posted By JANA CHARITRA
    | 06 Sep 2026, 03:21 PM | TELANGANA, వరంగల్
    తిప్పర్తి మండలం 26 గ్రామపంచాయతీలవద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా

    తిప్పర్తి మండల కేంద్రం గ్రామపంచాయతీ మరియు 26 గ్రామపంచాయతీ లవద్ద
    Some matter : కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై.. నేడు ఐదవ రోజు తిప్పర్తి మండలం 26 గ్రామపంచాయతీలవద్ద బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి..
    1000 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామపంచాయతీ పరిపాలన వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం మరియు గ్రామపంచాయతీ సిబ్బందికి నెల నెల జీతాలు ఇవ్వక వారి యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీని మరిచిన ఈ ప్రభుత్వాన్ని గ్రామపంచాయతీ కార్మికులు చీపుర్లు తోటి రాబోయే ఎన్నికలలో తరిమికొట్టాలని కోరుతున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు గత పది సంవత్సరాల కాలంలో గ్రామపంచాయతీలను అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోటి పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంలో చాలా కృషి చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రామపంచాయతీలను గాలికి వదిలేసి పారిశుధ్య పనులు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది అని అన్నారు, ఈ కార్యక్రమంలోBRS మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్... లొడంగి గోవర్ధన్ మండల కార్యదర్శి వనపర్తి నాగేశ్వరరావు,జ్యోతి తండు నరసింహ గౌడ్ కందుల లక్ష్మయ్య, ఊట్కూరు సందీప్ రెడ్డి, సర్పంచులు తగుళ్ళ శీను కొత్తపల్లి సైదులు కొల్లు నాగయ్య, నక్క జ్యోతి, కమల్, ఆయా గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు ఉపసర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు తిప్పర్తి గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు, కార్యకర్తలు, పాల్గొన్నారు