EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సేవా కార్యక్రమాలతో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం

    Author
    Posted By JANA CHARITRA
    | 06 Sep 2026, 04:10 PM | TELANGANA, వరంగల్
    సేవా కార్యక్రమాలతో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం

    ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం శిభిరం
    • భారీ రక్తదాన శిబిరంలో 320 మంది కార్యకర్తల రక్తదానం
    • రక్తదాతలకు ఇనగాల ట్రస్ట్ టి-షర్ట్స్ పంపిణీ
    • వేడుకలకు వచ్చిన వారందరికీ ఘనంగా అన్నదాన కార్యక్రమం

    పరకాల: హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలు పరకాల నియోజకవర్గంలో అత్యంత వైభవంగా, సేవా దృక్పథంతో జరిగాయి. గీసుగొండ మండలం పద్మావతి ఫంక్షన్ హాల్‌లో సంగెం, గిసుగొండ, 15, 16,17 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

    ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఇనగాల వెంకట్రామ్ రెడ్డిపై ఉన్న అభిమానంతో 320 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మరియు యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ఇనగాల ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా రూపొందించిన టి-షర్ట్స్‌ను అందజేసి అభినందించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ... తన జన్మదినం సందర్భంగా ఇంతటి భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానులు చూపించే ప్రేమాభిమానాలే తన బలమని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభ్యున్నతికి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడేలా ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన యువతను ఆయన అభినందించారు.

    వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు మరియు ప్రజల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.