EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాటా మధు వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

    Author
    Posted By JANA CHARITRA
    | 07 Sep 2026, 06:26 PM | TELANGANA, వరంగల్
    స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాటా మధు వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

    *ప్రజాస్వామ్య వ్యవస్థను, స్పీకర్ పదవిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు...*

    *యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్ తీవ్ర ఆగ్రహం*
    జన చరిత్ర న్యూస్ పర్వతగిరి
    పర్వతగిరి మండల కేంద్రంలో సోమవారం రోజున విలేకరుల సమావేశంలోతెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాటా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్ తీవ్రంగా ఖండించారు.
    ఈ సందర్భంగా కందికట్ల అనిల్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే శాసనసభ స్పీకర్ పదవిని కించపరిచే విధంగా మాట్లాడటం తాటా మధు రాజకీయ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని అన్నారు.
    తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి. అధికారం కోల్పోయిన బాధలో ఇష్టానుసారంగా మాట్లాడటం బీఆర్ఎస్ నేతలకు తగదు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి” అని కందికట్ల అనిల్ డిమాండ్ చేశారు.
    కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే, ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
    స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపైనా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ యువత తగిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెబుతుందని కందికట్ల అనిల్ హెచ్చరించారు.