EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 07:11 PM | TELANGANA, నల్గొండ
    బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు &  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ పోస్టర్‌ను ఆవిష్కరించిన రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
    తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు, యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఈ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు.షార్ట్‌ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం గొప్ప వేదికగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సంప్రదాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ ఛాలెంజ్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
    యువ ఫిలిం మేకర్స్, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026’ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారు పిలుపునిచ్చారు.