EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు" బీఆర్ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

    Author
    Posted By JANA CHARITRA
    | 08 Sep 2026, 07:16 PM | TELANGANA, వరంగల్
    ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు" బీఆర్ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

    గీసుకొండ: పరకాల నియోజకవర్గ అభివృద్ధికి చల్లా ధర్మారెడ్డి విశేషంగా కృషి చేశారని బీఆర్ఎస్‌ నాయకులు అన్నారు. గత పదేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా చల్లా ధర్మారెడ్డికి ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. మండలంలోని పీడీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో మండల బీఆర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చారని నాయకులు తెలిపారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జన్మదిన వేడుకలకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, బీఆర్ఎస్‌ నాయకులు చల్లా వేణుగోపాల్‌ రెడ్డి, గుర్రం రఘు, బోడకుంట్ల ప్రకాష్‌, జైపాల్‌రెడ్డి, గోలి రాజయ్య, అంకతి నాగేశ్వరరావు, రఘుపతిరెడ్డి, కొల్లూరి రవీందర్‌, ధనుంజయ్‌, సుంకరి శివ, యువజన అధ్యక్షుడు సిరిషే శ్రీకాంత్‌, సల్ల రాజు, కోట ప్రమోద్‌, లెనిన్‌, మంద రాజేందర్‌, అభిషేక్‌, అభి, మహిళా నాయకురాళ్లు కొండ రాధా, రేణుక, సరిత, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు