EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Sep 2026, 05:22 PM | TELANGANA, వరంగల్
    మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్

    వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్డి గారు మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్య ఆరోగ్య సేవలను పరిశీలించారు.

    ఈ సందర్భంగా వైద్యాధికారి డా.బి.జ్యోతి మరియు సిబ్బందితో మాట్లాడి, రికార్డులు, రిపోర్టులను పరిశీలించారు. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా పనితీరును మెరుగుపరచాలని సిబ్బందికి సూచించారు.

    మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజా రెడ్ - Additional Image

    అనంతరం టీకాల నిల్వవుంచే ఐ ఎల్ ఆర్, డీప్ ఫ్రిజెర్ లను పరిశీలించి కోల్డ్ చైన్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఫార్మసీ, మందుల లభ్యత, వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌పేషెంట్లతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    తదుపరి హెడ్‌క్వార్టర్ సిబ్బంది, ఫీల్డ్ సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి, ప్రజలకు నాణ్యమైన మరియు మెరుగైన వైద్య సేవలు అందించేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

    అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును మరింత పటిష్టం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని, సేవల నాణ్యతను పెంచాలని ఆదేశించారు. అలాగే సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజల్లో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.

    ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన, సమర్థవంతమైన మరియు ప్రజానుకూల ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని డి ఎం ఎచ్ ఓ, డాక్టర్ బి. రాజా రెడ్డి గారు సూచించారు.