EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • " ఎలుకుర్తి లో పోషణ మాసం"

    Author
    Posted By JANA CHARITRA
    | 10 Sep 2026, 05:35 PM | TELANGANA, తెలంగాణ, వరంగల్
    " ఎలుకుర్తి లో పోషణ మాసం"

    " ఎలుకుర్తి లో పోషణ మాసం"- గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో పోషణ మాసం సందర్భంగా
    ఎలుకుర్తి మహిళా ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముందుగా DWO రాజమణి మాట్లాడుతూ, ఈ పోషణ మాసంలో అంగన్వాడీ టీచర్లందరూ మీ సెంటర్లోకి వచ్చే న్యూట్రిషన్ ని గర్భిణీలు,బాలింతలు వాడే విధంగా చూడాలని ఈ పౌష్టిక ఆహారాన్ని తినడం వల్ల తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి దోహదపడుతుందని చెప్పి ముఖ్యంగా గర్భిణీలు వారి రోజువారి ఆహారంలో పాలు, ఆకుకూరలు, పండ్లు,పప్పులు ఉండే విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది.ఈ విధంగా తీసుకోవడం వల్ల నార్మల్ డెలివరీ అవుతారని చెప్పారు.గర్భిణీలు, బాలింతలను తరచుగా అంగన్వాడి టీచర్లు,ఆశా వర్కర్లు మానిటరింగ్ చేస్తూ పిల్లలకి టీకాలు వారి బరువులను తరచుగా చెక్ చేస్తూ ఉండాలని చెప్పడం జరిగింది. ప్రజ్వల్ సంస్థ నుండి గీసుగొండ PU మేనేజర్ ఆయేషా మేడం మాట్లాడుతూ, గర్భిణీలు మరియు బాలింతలు పురుగుమందులు పిచికారి చేసే సమయంలో ఆ ప్రదేశాలకు వెళ్లకూడదని చెప్పారు.అలా వెళ్ళినట్లయితే తల్లి,బిడ్డకి ప్రమాదం ఉంటుందని ఇంటిలో కూడా పురుగుమందు పిచికారి చేసిన పరికరాలను, ఖాళీ డబ్బాలను ప్రత్యేక గదిలో ఉంచుకోవాలని చెప్పారు.వారి యొక్క తల్లిదండ్రులు మందులు పిచికారీ చేసి వచ్చిన తర్వాత వెంటనే చిన్నపిల్లలను ఎత్తుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయరాదని ఇలా చేసినట్లయితే పురుగు మందు పిచికారి అవశేషాలు పిల్లలకి తాకి చర్మ సంబంధిత సమస్యలు,వాంతులు,విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారి తల్లిదండ్రులు వచ్చినాక స్నానం చేసినా తర్వాతనే పిల్లల్ని ఎత్తుకోవాలని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ దివ్యభారతి జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, ACDPO వర్దన్నపేట సువర్ణ మేడం సూపర్వైజర్లు మౌనిక,మాధవి, టీచర్లు,ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు గర్భిణీ బాలింతలు ప్రజ్వల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.