EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నిరుపేద ఆర్యవైశ్యుల భూమిని కాపాడాలి సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్యవైశ్యుల విజ్ఞప్తి

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 12:59 PM | TELANGANA, హైదరాబాద్
    నిరుపేద ఆర్యవైశ్యుల భూమిని కాపాడాలి  సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్యవైశ్యుల విజ్ఞప్తి

    తెలంగాణలోని నిరుపేద ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమిని కాపాడాలని ఆర్యవైశ్యుల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

    శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిరుపేద ఆర్యవైశ్యుల విద్య, వైద్యం, వసతి తదితర అవసరాలకు ఉపయోగపడేలా కేటాయించిన ఈ భూమిని కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

    నిరుపేద ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం కోలేటి దామోదర్, బిగాల గణేశ్ గుప్తా తదితరులు చేసిన కృషితో ప్రభుత్వం భూమిని కేటాయించిందని, అయితే ప్రస్తుతం ఆ భూమి అసలు లక్ష్యానికి భిన్నంగా వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.

    తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ వ్యవహారశైలిపై కూడా వారు తీవ్ర ఆరోపణలు చేశారు. సంఘ శ్రేయస్సు కోసం పనిచేసే వారిని పక్కనపెట్టి, తనకు అనుకూలంగా ఉండే వారికి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన మహాసభ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని, ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

    ఇవి కూడా చదవండి

    మహాసభ నిధుల వినియోగం, సంఘ కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకతపై కూడా సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం సంఘాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

    ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హాస్టళ్లు వంటి నిరుపేద ఆర్యవైశ్యులకు ఉపయోగపడే నిర్మాణాలే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాలు తదితర నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని కోరారు.

    అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి, సభ్యత్వం కోసం భారీ మొత్తాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై కూడా విచారణ జరపాలని కోరారు. రూ.11 లక్షలు చెల్లించిన వారికి ట్రస్ట్ సభ్యత్వాలు ఇస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

    నిరుపేద ఆర్యవైశ్యుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు ప్రయోజనాలకు మళ్లించకుండా, ప్రభుత్వం స్వాధీన పర్యవేక్షణలో అభివృద్ధి చేయాలని వారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.