EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దర్గాకు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి

    Author
    Posted By JANA CHARITRA
    | 11 Sep 2026, 08:36 PM | TELANGANA, వరంగల్
    దర్గాకు వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేయాలి

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలంలోని ప్రముఖ యాత్ర స్థలమైన అన్నారం షరీఫ్ గ్రామం లో గతం లో దర్గా దగ్గరికి వాహనాలు వెళ్లకుండా బారికెట్లు ఉండేటివి అప్పుడు ఆ బరికెట్లను తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మరియు దర్గాకు వెళ్లే మరో దారి జడల కృష్ణ దుకాణం ప్రక్కన బారికెట్లు ఏర్పాటు చేస్తాను అని అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ గారు చెప్పారు వాటిని తొలగించి ఇప్పటికి 6 నెలలు ఔతుంది ఐనా కూడా ఆ ప్లేసెస్ లో బారికెట్లు ఏర్పాటు చేయలేదు. ఆలా బారికెట్లు లేకుండా ఉండేసరికి పెద్ద పెద్ద వాహనాలు దర్గా దగ్గరిదాకా తీసుకు వస్తున్నారు మరియు దర్గాకు వచ్చే భక్తులు రాత్రి వేలల్లో దర్గాకు వెళ్లే దారిలోనే నిద్రలు చేస్తారు ఆలా బారికెట్లు ఏర్పాటు చేయకుండా ఉండేసరికి ఆ నిద్రిస్తున్న భక్తుల మీదినుండి వాహనాలు పోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది మొన్న రీసెంట్ గా కోళ్ల వ్యను దర్గాకు వెళ్లే దారికి దూసుకుపోవడం జరిగింది. ఆ సమయం లో ఆ ప్రదేశం లో భక్తులు ఎవ్వరు లేకపోయేసరికి పెద్ద ప్రాణాపాయం తప్పింది మరియు ఆ వాహనాలు రోడ్డు మధ్యలోనే ఉండేసరికి దర్గాకు దర్శనానికి వెళ్లాలంటే భక్తులు in చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్టి విషయాన్ని అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ , గ్రామ పాలక వర్గం వారు దర్గా ఇనిస్పెక్టర్ గమనించి ఆ బారికెట్లు మరల ఏర్పాటు చేయాగలరు అని అన్నారం షరీఫ్ గ్రామ ప్రజలు దర్గాకు వచ్చేటటువంటి భక్తులు కోరుతున్నారు.